ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;( హరిప్రసాద్ చీదళ్ళ). సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 138వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఆయన పేర్కొన్నారు.విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, విలువలు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన మార్గనిర్దేశం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బాధ్యత మరింత గొప్పది.ఎందుకంటే ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం ఎదుగుతుంది.ఒక బాలిక ఉన్నతంగా ఎదిగితే ఒక తరం మారుతుంది. విద్యావంతురాలైన ఒక మహిళ సమాజాన్ని మార్చగలదు. అందుకే ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి బాలికలో నేను ఒక భవిష్యత్తు డాక్టర్‌ను, ఇంజనీర్‌ను, ఉపాధ్యాయురాలిని, శాస్త్రవేత్తను, పోలీస్ అధికారిణిని, IAS అధికారిణిని, ప్రజాప్రతినిధిని చూడాలనుకుంటున్నాను అని అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous post

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందస్తు అరెస్టులు

Next post

విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి.మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు .

You May Have Missed