సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందస్తు అరెస్టులు

ప్రజాలహరి మిర్యాలగూడ; నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా, ముందస్తుగా మిర్యాలగూడ పట్టణ బీసీ జేఏసీ నాయకులను ఉదయం ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అక్రమ ముందస్తు అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ కన్వినర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. బీసీ బిడ్డ మహిళా బలహీన వర్గాల నాయకురాలు మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గమని అక్రమ ముందస్తు అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. ఈరోజు నకిరేకల్ నియోజకవర్గం పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ముందస్తుగా మిర్యాలగూడ పట్టణ బీసీ జేఏసీ నాయకులను ఉదయం ఇంటిదగ్గర అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే సవాల్గా మారిందని దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మొన్న జరిగిన బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ మహిళ మంత్రి కొండ సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గం. కొండా సురేఖ పక్షాన బీసీ సంఘాలు బీసీ జేఏసీ బీసీ సమాజం పక్షాన మేము చాలా తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకో న్యాయం బీసీలకు కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాలకు తగిన న్యాయం ప్రాతినిధ్యం తగ్గడం లేదన్నారు. బీసీ మహిళ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో కొండా సురేఖ గారిపై తీసుకున్న నిర్ణయం బీసీ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. మహిళా సాధికారత సామాజిక న్యాయం సమానత్వం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారని, అదేవిధంగా మరి ఒక బీసీ మహిళ నాయకురాలు రాజకీయంగా ఎదిగితే ఇదే నా కాంగ్రెస్ పార్టీలో గౌరవం విలువలు. రానున్న ఎన్నికల్లో బీసీ సమాజం ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మారిందని దీనికి రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. అక్రమంగా నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అక్రమ ముందస్తు అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరూ ఐకమత్యమై ఏకతాటి పైకి వచ్చి మన హక్కులను మన రాజ్యాధికారం సాధించుకొని దక్కించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, భారతీయ జనతా పార్టీ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొట్టు సోములు ముదిరాజ్, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు బంటుగిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్

Next post

ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

You May Have Missed