మిర్యాలగూడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సోదర, సోదరీమణులకు మరియు ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిర్యాలగూడలో యాదవ సంఘ భవన నిర్మాణం కోసం రూ.15 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. యాదవ సంఘం అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితం ధర్మం, న్యాయం, సత్యం మరియు సమాజ శ్రేయస్సుకు ప్రతీక అని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మట్టపల్లి సైదయ్య యాదవ్, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, జడ రాములు, దారం మల్లేష్ యాదవ్, ఎర్రయ్య ,జంగా లక్ష్మణ్, కంచుగట్ల లింగయ్య, పగిడి రామలింగయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed