జనగణనలో బీసీలను లెక్కించకుండా మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం…….. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్
ప్రజాలహరి మిర్యాలగూడ;బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వo యొక్క నిర్లక్ష వైఖరి సరికాదని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారoలోకి రాగానే బీసీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి, తీరా కులగణన జరుగుతున్న ఈ సమయంలో అస్పష్టంగా అశాస్త్రీయంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, అందులో 40 ప్రశ్నలు పొందుపరిచిందని అందులో మీరు ఎస్సీ నా ఎస్టీ నా అని అడిగారు కానీ మీరు ఓబిసి కి చెందిన వారా, అని మాత్రం అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక బీసీ ప్రధానిగా ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బీసీ జాబితా ప్రకటించి కులాలకు ఒక కోడ్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో::బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య, రజక బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఘంటా రాంబాబు యాదవ్, బీసీ యువజన సంఘం నాయకులు బంటు సైదులు ముదిరాజ్, తాడూరీ సైదులు రజక తదితరులు పాల్గొన్నారు.



