సెప్టెంబర్ 3 తారీకు రోజు వచ్చే కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాము
ప్రజాలహరి మిర్యాలగూడ;పొద్దున లేస్తే అబద్దాలు బ్రోకర్ మాటలు చెప్పే బిఆర్ఎస్ నాయకుల్లారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 1000 రోజులలో మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు సూటిగా చెప్పండి?సెప్టెంబర్ 3 తారీకు రోజు వచ్చే కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాము ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఐదు లక్షల రూపాయల తోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ?రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ?రైతులు పండించిన పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా?రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? .మహిళలకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయకున్నా నెల నెల జీతం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే 1000 రోజులలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



