ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR కేక్ కట్ చేసి, ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని BLR గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed