బీఆర్ఎస్లో చేరిన 3వ వార్డు ఖలీల్ అనుచరవర్గం
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ఖలీల్ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఈరోజు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు అన్నబీమోజు నాగార్జున చారి & మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్ ఖలీల్‌తో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఖలీల్ తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని నల్లమోతు భాస్కర్ రావు సూచించారు. 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఖలీల్ అనుచరులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



