ఆంధ్రప్రదేశ్ నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదు
ప్రజాలహరి మిర్యాలగూడ;నాగార్జునసాగర్ నుండి నీళ్లను తరలిస్తుండగా అభ్యంతరం చెప్పకపోవడం అంటే అనుమతి ఇచ్చినట్లే. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి రోజుకి 40 క్యూసెక్కుల నీళ్లు ఏపీకి తీసుకుపోతున్నారు. శ్రీశైలం – నాగార్జున సాగర్లో ఉన్న నిల్వ నీళ్లలో తక్కువబడిన 150 టీఎంసీల నీళ్లు ఏపీ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. నీ ఇంట్లో ఉండవలసిన వస్తువు పక్కనోడి ఇంట్లో ఉంది.. ఇంతకంటే వేరే సాక్ష్యం ఏం కావాలి. తీసుకుపోతున్నారని చెప్పడానికి రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కదా వీటికి కాపలా.. మీకు లంచం ఇచ్చే తీసుకుపోతున్నారు మీ రాజకీయ అవసరాల కోసం ఇక్కడ రైతులను ముంచి.. ఏపీకి నీళ్లు అమ్ముకుంటున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా..మిర్యాలగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి mla జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో అనుమతులు లేకుండానే ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు, నీటి తరలింపుపై రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందనిఢిల్లీ లాబీయింగ్,రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపడం లేదు అన్నారు.నాగార్జునసాగర్ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోకుండా,తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోకుండా నల్గొండ జిల్లా ఆయకట్టుకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు..రైతుల హక్కులు, కృష్ణా జలాల పరిరక్షణ కోసం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం..వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో రైతు ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని,వచ్చే నెల మూడో తేదీన మిర్యాలగూడలో రైతు మహా ధర్నా చేపడుతున్నాం..దానికి ..ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు హాజరు అవుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బీమా,రైతు బంధు ఎగ్గొట్టి మోసం చేసిందన్నారు. మహిళలకు ₹2,500, రైతు భరోసా,రుణమాఫీ హామీలు అన్ని ఎగ్గొట్టారని వెంటనే సాగర్ ఎడమ కాల్వ, amrp కింద కృష్ణా నీటిని విడుదల చేయాలి….లేదంటే చలో సాగర్ పేరుతో సాగర్ ను ముట్టడిస్తాం.. మా హక్కు అయిన నీళ్లను సాధిస్తాం… జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.. చిన్న పదవుల కోసం ప్రజల ముందు దోషులుగా మిగిలారు…ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారారు…. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ నీటి దోపిడీ జరుగుతున్నది…… రేవంత్ చంద్రబాబు లు కలిసి సాగర్ రైతులను పగ బట్టారు….. ఆంధ్రలో కుడి కాలువ కింద పంటలు పండుతున్నాయ్… మరి ఎడమ కాల్వ కింద మన రైతుల పొలాలు ఎందుకు ఎండుతున్నాయ్…రేవంత్ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి…. మిర్యాలగూడలో నిర్వహిస్తున్న సభతో ప్రభుత్వం బండారం బయటపెడతం…. KTR గారు హాజరయ్యే రైతు మహాధర్నా కు సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా తరలిరావాలి… ఇప్పటికైనా సాగర్ ఆయకట్టు రైతులు చైతన్యం కావాలి…పోరాటం ఇంతటితో ఆగదు…. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే వుంటాం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు



