పెన్షన్ల కోసం 412 దరఖాస్తులు అందినాయి.
పెన్షన్ల కోసం 412 దరఖాస్తులు అందినాయి.
వేములపల్లి( ప్రజాలహరి) కాంగ్రెస్ ప్రభుత్వం నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా వేములపల్లి మండలంలోని 12 గ్రామాలకు గాను 412 దరఖాస్తులు వచ్చినట్టుగా వేములపల్లి ఇన్చార్జి ఎంపీడీవో సునీత సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయా గ్రామాలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అందులో భాగంగానే ఆమనగల్లు గ్రామంలో వితంతు పెన్షన్ల కోసం 27 మంది దరఖాస్తు చేసుకోగా ఒంటరి మహిళల 4 దరఖాస్తు చేసుకోగా వికలాంగులు7 దరఖాస్తు చేసుకోగా గీత కార్మికులు 9 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అన్నపురెడ్డిగూడెం గ్రామంలో వితంతు పెన్షన్ కోసం5గురు వికలాంగుల పెన్షన్ కోసం 2 దరఖాస్తు చేసుకున్నారు. బుగ్గ బాయ్ గూడెం గ్రామంలో వితంతు పెన్షన్ కోసం 12 మంది, వికలాంగుల పెన్షన్ కోసం2 దరఖాస్తులు వచ్చాయి, కామేపల్లి గ్రామంలో,7 వితంతు పెన్షన్ల కోసం2 ఒంటరి మహిళల కోసం2 వికలాంగుల పెన్షన్ కోసం,1 గీత కార్మికుల పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. లక్ష్మీదేవి గూడెం గ్రామంలో 7గురు వితంతు పెన్షన్ కోసం, ఒకటి ఒంటరి మహిళ కోసం 8 వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగాపురం గ్రామంలో 3 వితంతు పెన్షన్ కోసం ఒకటి వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్కా పట్నం గ్రామంలో వితంతు పెన్షన్ కోసం 21 మంది దరఖాస్తులు 2 ఒంటరి మహిళలు11 మంది వికలాంగులు 13 మంది గీత కార్మికుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రావుల పెంట గ్రామంలో 33 మంది వితంతు పెన్షన్ కోసం నలుగురు ఒంటరి మహిళలు 25 మంది వికలాంగుల కోసం 15 మంది గీత కార్మికుల కోసం దరఖాస్తు చేసుకున్నారు సల్పునూరు గ్రామంలో 16 మంది వితంతు పెన్షన్ కోసం, 3గురు ఒంటరి మహిళల కోసం, 10 మంది వికలాంగులు 4 హిత కార్మికుల దరఖాస్తు చేసుకున్నారు. శెట్టిపాలెం గ్రామంలో 38 మంది వితంతు పెన్షన్ కోసం నలుగురు ఒంటరి మహిళలు, 20 మంది వికలాంగులు, 11 మంది గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో ఏడుగురు వితంతు పెన్షన్ కోసం 1 వికలాంగుల పెన్షన్ కోసం 1 ఒకరు గీత కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వేములపల్లి గ్రామపంచాయతీ లోను 34 మంది వికలాంగుల పెన్షన్ కోసం, 9 మంది ఒంటరి మహిళల కోసం 13 మంది వికలాంగుల పెన్షన్ కోసం, 9 మంది చేనేత కార్మికుల కోసం, ఇద్దరు గీత కార్మికుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ నెల 15వ తారీకు వరకు గడువు పొడిగించినట్టుగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట కార్యాలయం సిబ్బంది మిరాజ్ టైపిస్ట్ తదితరులు పాల్గొన్నారు



