మోసపూరిత హామీలపై సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా BRS నిరసనలు 3 వ తారిఖు నాడు చేపట్టే కార్యక్రమానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి KTR హాజరు.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని BRS పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శ్రీ నల్లమోతు భాస్కర్ రావు , శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి , శ్రీ తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 3 వ తేదీ నాడు చేపట్టే రైతు సదస్సులలో భాగంగా ఆ కార్యక్రమానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి KTR హాజరుఅవుతారని తెలిపారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహ రెడ్డి తో పాటు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి,దుర్గంపూడి నారాయణ రెడ్డి,ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి,అన్నబీమోజు నాగార్జున చారి, ధనావత్ చిట్టిబాబు నాయక్,ధనావత్ బాలాజీ నాయక్,కుందూరు వీరకోటి రెడ్డి, కుర్ర సేవ్యా నాయక్, చౌగాని బిక్షం గౌడ్,అమరావతి సైదులు, పాశం నరసింహ రెడ్డి,కొత్త మరేడ్డి, అలాకాని రమణ,సందేషి అంజన్ రాజు, మాలవాత్ రవీందర్ నాయక్,MD.షోయబ్,ఎల్గుబెల్లి నాగరాజు, వెంకన్న యాదవ్,రాజబోయిన గోపి యాదవ్, వడ్త్య శివ, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



