శ్రావణమాస బోనాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;శ్రావణమాస బోనాల మహోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన బోనాల వేడుకల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు… ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అనంతరం స్థానిక ప్రజలు, మహిళలు, భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొని వారిని ఆత్మీయంగా పలకరించారు..‌ శ్రావణమాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, మన ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Previous post

నల్గొండ జిల్లా బొత్తలపాలెం లో దారుణం మానసిక వికలాంగురాలిపై అత్యాచారం 

Next post

మోసపూరిత హామీలపై సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా BRS నిరసనలు 3 వ తారిఖు నాడు చేపట్టే కార్యక్రమానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి KTR హాజరు.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

You May Have Missed