నల్గొండ జిల్లా బొత్తలపాలెం లో దారుణం మానసిక వికలాంగురాలిపై అత్యాచారం 

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ;నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో మానసిక వికలాంగురాలి పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన చోటుచేసుకుంది. సదరు మానసిక వికలాంగురాలి తల్లి అవసర నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చే లోపు గదిలో నుండి రోదనలు వినిపించడం గమనించిన తల్లి ఇరుగుపొరుగు వారిని పిలిచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ను రప్పించి నమూనాలు సేకరించగా స్థానిక పదహారేళ్ళ మైనర్ బాలుడు మానసిక వికలాంగురాలిని బైండింగ్ తో కాళ్ళను కట్టేసి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది గతంలో కూడా ఈ బాలుడు ఒకరిపై ఇటువంటి అకృత్యానికి పాల్పడుతుండగా స్థానికులు చూడడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ సిఐ ప్రసాద్ తెలిపారు.

You May Have Missed