బీసీ జేఏసీ ఆధ్వర్యంలో లింగంపల్లి చిరంజీవికి ఘన సన్మానం

ప్రజాలహరి మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన లింగంపల్లి చిరంజీవి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRCCI) తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మిర్యాలగూడ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ భవన్ లో శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, కో-కన్వీనర్ దాసరాజు జయరాజు, మురళి యాదవ్ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి పాటుపడుతూ, బీసీల హక్కుల సాధనకై అహర్నిశలు శ్రమిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న బీసీ బిడ్డ లింగంపల్లి చిరంజీవికి మరెన్నో ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ 48వ వార్డు ఇంచార్జ్, బీఆర్ఎస్ నాయకులు బంటు దుర్గయ్య మాట్లాడుతూ.. బీసీలంతా సమైక్యంగా ఏకమై ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడాలని, ‘మా జనాభా ఎంతో మాకు అంత వాటా’ అనే నినాదంతో రాజకీయంగా బీసీలు ఎదగాలని, ప్రతి ఒక్కరూ బీసీల ఐక్యతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్ నాయకులు బంటు దుర్గయ్య, నక్క వెంకన్న, బంటు శ్రీనివాస్, సుధాకర్, మహేందర్ , పున్న రాములు, రాజ్ కుమార్, mvr రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous post

_మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ

Next post

నల్గొండ జిల్లా బొత్తలపాలెం లో దారుణం మానసిక వికలాంగురాలిపై అత్యాచారం 

You May Have Missed