ప్రభుత్వ విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలి; జూలకంటి. 

ప్రజాలహరి మిర్యాలగూడ;ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి.రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యలపై జరుపుతున్న నిర్లక్ష్యాన్ని రైతులకు వ్యతిరేకంగా జరుపుతున్న విధానాలపై మరొక పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో 2000 సంవత్సరంలో హైదరాబాదులోని బషీర్బాగ్ వద్ద నాటి ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటాలు అమరులైన విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి ల కు వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ నాటి టిడిపి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ సంస్థలను చేపట్టగా దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు వీరోచిత పోరాటం జరిగిందని, ఆనాడు విద్యుత్ సంస్థల పేరుతో వ్యవసాయానికి మీటర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించామని, నేడు కూడా విద్యుత్ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి మరో పోరాటం జరగాల్సిఉందని వారు తెలిపారు. నేటి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తమ గుప్పట్లో పెట్టుకొని ఏకపక్షంగా నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు ప్రజలకు ఇచ్చే రాయితీలను ఇవ్వకుండా కార్పొరేట్ శక్తులకు విదేశీ స్వదేశీ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాయని, దీనిని వ్యతిరేకించాలని ఆయన కోరారు. నాటి పోరాటంలో అమరులైన వారికి సిపిఎం నాయకులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రవి నాయక్, మంగారెడ్డి ,పరశురాములు, రామ్మూర్తి, కోడి రెక్క మల్లయ్య ,రెడ్డి దేశి రాం ,రామారావు, ల్యాబ్ సంఘం నాయకులు శ్రీను, బుడిగ సైదులు, సిపిఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు ,ఎం సిపిఐ నాయకులు వస్కుల మట్టయ్య పాల్గొన్నారు.

Previous post

ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షా సమావేశం

Next post

బషీర్బాగ్ వద్ద జరిపిన కాల్పులలో అమరులైన విద్యుత్ కార్ర్మికులకు సిపిఐఎం కార్యాలయంలోఘన నివాళి

You May Have Missed