ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షా సమావేశం

ప్రజాలహరి మిర్యాలగూడ;సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే మరియు గృహ నిర్మాణ శాఖల సమీక్షా సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు.రెవెన్యూ మరియు గృహ నిర్మాణాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, భూ సర్వే, గృహ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు… ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, భూ సమస్యల పరిష్కారం, గృహ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు… ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed