విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ హాస్టల్‌లో విద్యార్థులతో యాజమాన్యం పనులు చేయిస్తున్నారంటూ పలు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందడంతోమిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR మోడల్ స్కూల్‌తో పాటు పలు గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR హాస్టల్, పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలపై యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు…విద్యార్థుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు.“విద్యార్థులు చదువుకోవడానికి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి పాఠశాలలు, గురుకులాలకు వస్తారు… వారితో ఎలాంటి పనులు చేయించడం సహించేది లేదు. విద్యార్థులతో పనులు చేయించినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం… విద్యార్థుల హక్కులు, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని ఎమ్మెల్యే BLR స్పష్టం చేశారు..విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని ఆయన పేర్కొన్నారు… విద్యార్థుల నుంచి వచ్చే సమస్యలు, ఫిర్యాదులను అధికారులు, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని సూచించారు.విద్యార్థుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యాసంస్థల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనను ఉపేక్షించబోమని ఎమ్మెల్యే – BLR తెలిపారు…

You May Have Missed