బీసీ రిజర్వేషన్ ల ఆరాద్యులు -పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్

బీసీ రిజర్వేషన్ ల ఆరాద్యులు -పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ (బిందేశ్వరి ప్రసాద్ మండల్ )గారి 109.వ జయంతిని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మండల్ చిత్రపటానికి పూలమాలలతో ఘనమైన నివాళులు…….. బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనకు సంబందించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నటువంటి గెజిట్ లో ఓబీసీల కు సంబంధించిన కాలం లేకపోవడం చాలా అన్యాయం సిగ్గుచేటు దుర్మార్గం.  ఓబీసీ రిజర్వేషన్ ల సాధన కోసం బీపీ మండల్ చేసిన కృషి అనిర్వచనియమైనది. మండల్ కమిషన్ సిపారసులన్నింటిని వెంటనే అమలు చేయాలి.                           బీపీ మండల్ జయంతి సందర్బంగా ఆయన ఆశయ సాధన కొరకు ముఖ్యంగా యువకులు ప్రతి ఒక్కరు నడుం బిగించి పాటు పడాలన్నారు.   బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం వెనుకబాటు తనం నుంచి వారిని బయటపడేసే ప్రయత్నంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ చేసిన కృషి మరువలేనిదని దేశంలో 60 శాతం పైగా జనాభా కలిగిన ఓబీసీలకు విద్య ఉద్యోగ తదితర రంగాల్లో రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ చేసిన కృషి ఆనిర్వచనీయ మైనదని బీసీల ఆరాధ్యులు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ (బందేశ్వరి ప్రసాద్ మండల్) 109 వ జయంతిని స్థానిక మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మండల్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగిందన్నారు. అనంతరం బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ బీహార్ లోని సామాన్య యాదవ కుటుంబంలో జన్మించి ఫూలే అంబేద్కర్ వారసత్వానికి పుచ్చుకొని ఎమ్మెల్సీగా ఎంపీగా ఎన్నిక కావడమే కాకుండా బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. జనతా ప్రభుత్వం లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టికల్ 340 ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ల కల్పన కోసం బీపీ మండల్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసి, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేశారు స్వాతంత్ర్యం వచ్చిన 45 సంవత్సరాల తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్లు సాధించిన ఘనత బీపీ మండల్ కు దక్కుతుందన్నారు. బీసీలను పట్టిపీడిస్తున్న పేదరికం వెనుక బాటు తనం నుంచి వారిని బయటపడేసే ప్రయత్నం లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ చేసిన కృషి మరువలేనిది అని బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ కొనియాడారు. బీపీ మండల్ వెనుకబడిన తరగతుల కమిషన్ కు అధ్యక్షతన వహించారు ఇది 1980లో తన నివేదికను సమర్పించింది.ఈ కమిషన్ సిపారసుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు ఇచ్చాయి మండల్ సామాజిక న్యాయం అణగారిన వర్గాల హక్కుల కోసం ముఖ్యంగా ఓబీసీల కోసం గట్టిగా వాదించారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తునటువంటి జనగణనలో కులగణనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికెషన్లో ఓబీసీల కు సంబంధించిన కాలమ్ లేకపోవడం చాలా సిగ్గు చెటన్నారు. జనగణన లెక్కింపు కార్యక్రమంలో 28అంశాలతో కూడిన ప్రతి విడుదల చేసి దానిలో కూడా ఓబీసీల కాలం ఉంచలేదు. 12వ కాలంలో ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అని పెట్టడం జరిగిందని కానీ క్యాస్ట్ ఓపెన్ గా పెట్టకపోవడంతో ఓబీసీ అని లేకపోవడం వల్ల ఓబీసీ లో ఉన్నటువంటి కులాలను లెక్కించడం కష్టంగా మారుతుందని అని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను యూనిట్లగా తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబిసి కులాలను లెక్కచేస్తే దేశవ్యాప్తంగా లెక్కలు చేయడానికి సులువుగా ఉంటుందని భావించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇలా బీసీల లెక్కలను తీయకపోతే రానున్న రోజుల్లో జెన్ జి ఉద్యమ తరహాలో ఉద్యమించి బీసీల హక్కుల కోసం పోరాడుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీసీలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. బిపి మండల్ (బిందెశ్వరి ప్రసాద్ మండల్) 109 వ జయంతి సందర్భంగా మండల్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువకులు నడుం బిగించి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో!! బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక,రేవంతు మహేష్,సంతోష్, నరేష్, చింటూ,అభిలాష్,సమీర్, సాత్విక్,అక్షయ,వైష్ణవి, నికిత, కార్తీ క్,రామ్, చరణ్, లలిత,గౌతమి,నందిని, సరస్వతి,వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

You May Have Missed