హమాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ప్రజాలహరి మిర్యాలగూడ ;ఈరోజు దామచర్ల మండల కేంద్రంలో హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధంతో అన్ని రంగాల హమాలీ వర్కర్స్ కార్మికుల కు 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దామరచర్ల తహసిల్దార్ గారికి 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ దయానంద మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు కోసం ప్రత్యేకంగా హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హమాలి కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ హామీలను నేటికీ అమలుకు నోచుకోలేదు. కావున ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ క్రింది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. హమాలి కార్మికులందరికీ హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్య సేవలు అందించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. రాష్ట్రంలోని హమాలీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి అసంఘటిత కార్మికులుగా నమోదు చేయాలి. 55 సంవత్సరాలు పైబడిన కార్మికులకు నెలకు కనీసం 6000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఇల్లు లేని హమాలి కార్మికులందరికీ ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని, పనిచేస్తూ ప్రమాదంలో మరణించిన కార్మికులకు 25 లక్షల నష్టపరివార ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హమాలి సంఘం నాయకుడు రాపోలు కోటయ్య, అప్పారావు పాల్గొన్నారు.

Previous post

పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. —————-  డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవి నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

Next post

ప్రభుత్వ హామీల కమిటీ (Assurance Committee) చైర్మన్‌గా ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతల స్వీకరణ

You May Have Missed