పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. —————-  డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవి నాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్

ప్రజాలహరి మిర్యాలగూడ;భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు జగన్ నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపాటి శంకర్ మూడవత్ రవి నాయక్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారుస్తుందని ఆరోపించారు ఇప్పటికీ రాష్ట్రంలో బకాయిలో ఉన్న 10,500 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల పై చదువులకు పేద విద్యార్థులు వెళ్లాలంటే కళాశాల యజమాన్యం రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి రాబోయే అసెంబ్లీ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదా నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వీరన్న, సంపత్, లోహి, ఝాన్సీ, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సభ్యులు కార్తీక్, సమీర్, హనుమంతు, వెంకటేష్, చరణ్ పాల్గొన్నారు.

You May Have Missed