ప్రభుత్వ హామీల కమిటీ (Assurance Committee) చైర్మన్గా ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతల స్వీకరణ
ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ శాసన మండలిలో జరిగిన Assurance Committee (2026–27) ప్రాథమిక సమావేశంలో చైర్మన్గా పాల్గొని కమిటీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా గౌరవ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ గా, కమిటీ సభ్యులు భాను ప్రసాద్ , రవీందర్ , మధుసూదన్ గా, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు నరసింహాచారి , తిరుపతి, ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.


