మిర్యాలగూడ చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ చేనేత సహకార సంఘం పాలకమండలి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను గురువారం ఏఓ (అసిస్టెంట్ ఆఫీసర్) అధికారికంగా విడుదల చేశారు. ఏఓ గారి చేతుల మీదుగా నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లైంది. ఈ కార్యక్రమంలో ఏఓ గారితో పాటు చేనేత సహకార సంఘం మేనేజర్, ప్రస్తుత (పాత) పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చేనేత సంఘం సభ్యులు ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

You May Have Missed