శ్రావణ మాస బోనాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం తకెళ్లపాడు గ్రామంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారు పాల్గొన్నారు… ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు… శ్రావణ మాస బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన గ్రామ ప్రజలకు, నిర్వాహకులకు ఎమ్మెల్యే BLR శుభాకాంక్షలు తెలిపారు… గ్రామంలో ఆధ్యాత్మికత, ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తూ ఇలాంటి పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు… ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు..



