శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు 

 

ప్రజాలహరి హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ , రాంబాబు నాయక్ ,హాలియా మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 5వ వార్డులో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ , 5వ వార్డు కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్ , 2వ వార్డు కౌన్సిలర్ సలహాదారు నకరికంటి సైదులు , 6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు , 9వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు , 12వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ , మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు ఆలయ ప్రసాదం అందించి ఆశీర్వదించారు.

Previous post

శ్రావణ మాస బోనాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

Next post

ఎమ్మెల్యే సతీమణి మాధవి, కుమారుడు సాయి ప్రసన్నా రెడ్డి చేతుల మీదుగా ఉట్లపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్లేట్లు, పండ్లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి సుచరిత దంపతులు

You May Have Missed