ఎమ్మెల్యే సతీమణి మాధవి, కుమారుడు సాయి ప్రసన్నా రెడ్డి చేతుల మీదుగా ఉట్లపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్లేట్లు, పండ్లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి సుచరిత దంపతులు

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి సుచరిత దంపతుల సహకారంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి మాధవి, కుమారుడు సాయి ప్రసన్న రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ అభివృద్ధికి మా నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పక చేయడం జరుగుతుందని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. దాత మేడ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ,… గ్రామ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు .అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సతీమణి మాధవి మరియు కుమారుడు సాయి ప్రసన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీమా, గ్రామ కార్యదర్శి రాధ, వార్డు సబ్యులు జానయ్య, అయోధ్య, లక్ష్మమ్మ, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బట్టు వెంకన్న, షాబుద్దీన్, బొంగరాల కిరణ్, బొప్పిడి శ్రీనివాస్ రెడ్డి, సంజీవ, ప్రసాద్, వీరబాబు, మేధా ఫౌండేషన్ ఫౌండర్స్ నాగరాజు, వేణు, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed