ప్రపంచం మెచ్చిన కమ్యూనిస్టు మేధావి సీతారాం ఏచూరి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్
ప్రపంచం మెచ్చిన కమ్యూనిస్టు మేధావి సీతారాం ఏచూరి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ప్రజాలహరి మిర్యాలగూడ;సోషలిజమే మానవాళి విముక్తికి దోహద కారి అని కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న ప్రపంచం మెచ్చిన కమ్యూనిస్టు మేధావి సీతారాం ఏచూరి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు పెరగకుండా లౌకిక తత్వానికి హాని కలగ కుండా పోరాటాలకు ఆయన రూపకల్పన చేశారని తెలిపారు. పార్లమెంట్లో సభ్యుడుగా ఎన్నికై ప్రజావాణిని వినిపించిన గొప్ప నాయకుడని అన్నారు. నేటి పాలకులు ఆయన రూపొందించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎండగట్టాలని వారు కోరారు. కమ్యూనిస్టు పార్టీ నుండి దేశ ప్రతినిధిగా అనేక అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని కమ్యూనిజం విశిష్టతను ప్రపంచానికి చాటాడని ఆయన తెలిపారు. వర్తమాన పరిస్థితులను ఆకలింపు చేసుకొని వాటికి తగ్గట్టుగా ఉద్యమాలు చేపట్టడం జరిగిందని ఆయన బాటలో కార్యకర్తలు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, సిపిఎం నాయకులు భావండ్ల పాండు, ముత్యాల లక్ష్మీనారాయణ, కోడిరెక్క మల్లయ్య, రామారావు,ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్ నాయక్, సైదా నాయక్, జగన్ నాయక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.



