భాజాపా ఓబీసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన మిర్యాలగూడ వాసి పిన్నం బ్రహ్మచారి — ఆర్ఎస్ఎస్ లో శిక్షణ మొదలు — సాధారణ బూత్ స్థాయి కార్యకర్తగా, మండల ఉపాధ్యక్షులుగా, నేడు జిల్లా కార్యవర్గంలోకి  — క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో సేవలు

ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన పిన్నం బ్రహ్మచారి భాజాపా ఓబీసి జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుండి మొదలు, బూత్ స్థాయి నుండి భాజాపాలో బాధ్యతలు నిర్వర్తించి, మండల ఉపాధ్యక్షులుగా క్రమశిక్షణతో కార్యకర్తగా పార్టీకి బ్రహ్మచారి చేసిన సేవలకు గాను,… జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్ ఆదేశాల మేరకు మంగళవారం రోజు ఓబీసీ మోర్చా నల్లగొండ జిల్లా కమిటీని ప్రకటించగా బ్రహ్మచారికి కార్యవర్గంలో చోటు దక్కింది,. బ్రహ్మచారి ఈ సందర్బంగా మాట్లాడుతూ,… పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు గాను తనను గుర్తించి జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించిన జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డికి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి ఉదయ్ ప్రతాప్ గారికి మరియు ఎన్నికకు సహకరించిన మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాసరావు, మరియు ముఖ్య నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం తనపై మరింత బాధ్యతను పెంచుతుందని పత్రికా ముఖంగా తెలియజేశారు.

You May Have Missed