వేములపల్లి మండల కేంద్రంలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేయించండి పుట్టల దినేష్
ప్రజాలహరి వేములపల్లి;వేములపల్లి మండల కేంద్రం అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి పై ఫ్లై ఓవర్ నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఆర్డిఓ రమణారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి నార్కెట్పల్లి జాతీయ ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం లేదా సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారి దాటే సమయంలో పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, మరియు స్థానికులు ప్రాణాల మీదకు తెచ్చుకొని రోడ్డు దాటవలసి వస్తుంది సర్వీస్ రోడ్డు ఫ్లై ఓవర్ లేకపోవడం వలన ఇటీవల కాలంలో తరచుగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. గ్రామ ప్రజలందరికీ భద్రతను దృష్టిలో ఉంచుకొని సర్వీస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, MCPI రాష్ట్ర నాయకులు, వాస్కుల మట్టయ్య, BSP మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్టల దినేష్, BSP నల్గొండ జిల్లా ఈసీ నెంబర్ గాలిబ్, AIMIM పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి ఫారుక్, MCPI నాయకులు పోతుగంటి కాశి, తదితరులు పాల్గొన్నారు



