గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో శెట్టిపాలెం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం చెరుకు సత్యనారాయణ( 49) అను వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతని పరిస్థితి విషమించడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుర్లు అతని భార్య పారిజాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా వాహనం కోసం స్థానిక ఎస్సై, సిబ్బంది పట్టుకున్న ప్రయత్నంలో ఉన్నారు.


