యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు…ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ గారు యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే BLR యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ…దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు… కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు… యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు… యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజా సమస్యలపై పోరాడుతూ, యువత మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయాలని ఎమ్మెల్యే BLR గారు ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ హాజరుద్దీన్ , కాంగ్రెస్ నాయకులు చిలుకూరి బాలకృష్ణ, నూకల వేణుగోపాల్ రెడ్డి , టౌన్ ప్రెసిడెంట్ లు మోయిజ్ , కోడిరెక్క ఇంద్ర కుమార్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు..


