మిర్యాలగూడలో గురుకులాలు, గ్రంథాలయంలో నిరుద్యోగ యువతతో ఎమ్మెల్సి ఎం.సి. కోటి రెడ్డి, ఎమ్మెల్సి అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు ముఖాముఖి

మిర్యాలగూడలో గురుకులాలు, గ్రంథాలయంలో నిరుద్యోగ యువతతో ఎమ్మెల్సి ఎం.సి. కోటి రెడ్డి, ఎమ్మెల్సి అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గారు ముఖాముఖి

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ నియోజకవర్గంలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి , ఎమ్మెల్సి ఎం.సి. కోటి రెడ్డి , BRS పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ కలిసి పలు గురుకుల విద్యాసంస్థలు మరియు జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల విడుదల, కోచింగ్ సదుపాయాలు, గ్రంథాలయాల్లో మౌలిక వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకొని, పలు సూచనలు స్వీకరించారు. ఎమ్మెల్సి ఎం.సి. కోటి రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యలను శాసన మండలిలో బలంగా ప్రస్తావిస్తూ వారి హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానాల కోసం నిరంతరం పోరాటం చేస్తానని, పట్టభద్రుల గొంతుకగా శాసన మండలిలో నిలుస్తానని హామీ ఇచ్చారు. BRS రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ మాట్లాడుతూ, పట్టభద్రులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం BRS పార్టీ కట్టుబడి ఉందని, రాబోయే ఎమ్మెల్సి ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం రెడ్డి కాలని BRS పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొని పలు అంశాలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.. ఈ కార్యక్రమంలో BRS మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండి.మగ్దుం పాషా,ధనావత్ చిట్టిబాబు నాయక్, గంగుల బిక్షం యాదవ్, యర్రమల్ల దినేష్,ఎండి.షోయబ్,చీదల్ల వెంకటేశ్వర్లు, పునాటి లక్ష్మీనారాయణ,భూక్య రాంబాబు, ఎక్క మనిదీప్, వల్లపట్ల వినోద్,గయాస్, గంట శ్రావణ్ రెడ్డి,రఫీ, వీర నాయక్,వడ్త్య శివ నాయక్, రామావత్ వినోద్ నాయక్,షేక్ మస్తాన్,అలీం, దోనేటి సైదులు, తుమ్మల ఫణి కుమార్,కాతోజు వినోద్ కుమార్, కోర్రపిడత లింగారాజు,మహిమూద్, రాజేష్, షేక్ ఫయాజ్, నాగరాజు,అబిలాస్,వినయ్,నాగయ్య,చిన్న నాయక్, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed