తీజ్ పండుగ సంబరాల్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్

ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన సాంప్రదాయ సంబరాల్లో ఎమ్మెల్సీ, టీపీసీసీ ఆదివాసి చైర్మన్ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.    ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, బంజారా మహిళలు సంప్రదాయ వేషధారణలో ఘన స్వాగతం పలికి, సాంప్రదాయ ఆచారాలతో ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించారు. గ్రామ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వారి ఆనందోత్సాహాలను పంచుకుని, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బ తండ గ్రామ సర్పంచ్ శ్రీ మాలోతు ఇందిర గిరిబాబు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంజారా సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed