ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (AVOPA – ఆవోపా), మిర్యాలగూడ ఆధ్వర్యంలో
ప్రజాలహరి మిర్యాలగూడ;(హరిప్రసాద్ చీదళ్ళ)మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని ఆర్యవైశ్య బీద వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా, సమాజంలో ఉన్న పేదలకు సహాయం అందించడమే ఆవోపా యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ పేద వితంతువులకు ప్రతి ఏటా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.



