మిర్యాలగూడ పట్టణంలో డంపింగ్ యార్డును సందర్శించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ – బాలకృష్ణ, వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్,మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి,
ప్రజాలహరి మిర్యాలగూడ; పట్టణంలోని డంపింగ్ యార్డును సందర్శించి డంపింగ్ యార్డులో చెత్త నిర్వాహణ, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు మరియు చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎదుర్కొంటున్న దుర్గంధం, ఆరోగ్య సమస్యలపై అధికారులతో మాట్లాడారు.డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న చెత్తను త్వరగా ప్రాసెస్ చేయడానికి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పురపాలక (మున్సిపల్) అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.పట్టణంలో పారిశుధ్యం సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు, డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.



