రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరీక్షించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్
ప్రజాలహరి మిర్యాలగూడ ( హరి ప్రసాద్ చీదళ్ళ)రాజన్న సిరిసిల్ల జిల్లా లో 30/09/2026 నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన శంకర్ నాయక్.సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ సమీక్షించారు.ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ శ్రీ కేకే మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు.సభను విజయవంతంగా నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.



