మిర్యాలగూడ ఎస్ వి గార్డెన్ లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణం SV గార్డెన్ లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న
తెలంగాణ నీటిపారుదల, మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎంపీ రఘువీరా రెడ్డి ,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి BLR ,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్,మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ – బాలకృష్ణ
వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్, RDO రమణ రెడ్డి ,MRO శ్రీనివాస్ ,మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి,
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.నాణ్యమైన రేషన్ సరుకులు మరియు సేవలు ప్రజలకు పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.ప్రజా పాలనలో అర్హులైన వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ, సాంకేతికతను జోడించి పౌర సరఫరాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, BLR బ్రదర్స్, మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.



