కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.. MLA -BLR
ప్రజాలహరి మిర్యాలగూడ; తెలంగాణ ఉద్యమ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 111వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మిర్యాలగూడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ,మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు…
ఈ సందర్భంగా MLA -BLR మాట్లాడుతూ…స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు.ఆయన ఆశయాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



