కొత్తపేట తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
ప్రజాలహరి మిర్యాలగూడ;( హరిప్రసాద్ చీదళ్ళ)దామరచర్ల మండలం కొత్తపేట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR , లబ్ధిదారుల కుటుంబ సభ్యులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.నూతన గృహాల్లో గృహప్రవేశం చేసుకుంటున్న లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పించినందుకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



