విజయదశమి ఉత్సవాల భూమి పూజలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ;హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని NSP క్యాంప్ గ్రౌండ్ నందు నిర్వహించనున్న విజయదశమి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు విజయదశమి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిలుకూరి సుధా బాలకృష్ణ , కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed