ఘనంగా నిర్వహించిన అనుముల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల కార్యక్రమం.
ప్రజాలహరి మిర్యాలగూడ ; డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ అనుముల కార్యాలయం వేదికగా, అనుముల మండల విద్యాధికారి శ్రీ రామచంద్రయ్య అధ్యక్షతన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మరియు మండల అభివృద్ధి అధికారి మాజీద్ అనుముల, పాల్గొని ఉపాధ్యాయులు రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిర్మాతలని, మరియు మంచి నాణ్యమైన గుణాత్మకమైన విద్యను విద్యార్థులకు అందించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరినారు. చలమారెడ్డి గూడెం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు M. ప్రకాష్ , ఉన్నత పాఠశాల కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు D.వెంకన్న. TSUTF, PRTU TS మరియుTPUS సంఘాల నాయకులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయ మిత్రులు,CRP లు, MRC సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
.



