చాకలి ఐలమ్మ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నివాళులు
ప్రజాలహరి మిర్యాలగూడ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆమె చిత్రపటానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి ,బూడిద బిక్షమయ్య గౌడ్, నరసింహారెడ్డి తో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఆయన, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ధైర్యం, స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శప్రాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.



