మిర్యాలగూడ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి
ప్రజాలహరి మిర్యాలగూడ:తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దోపిడి అణచి వేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కొరకు పోరాటం చేసిన వీర వనిత శ్రీ చాకలి చిట్యాల ఐలమ్మ 131 వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించిన బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్. ఆ మహనీయురాలి ఆశయ సాధన కొరకు తన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయాలి, పది వేల లోపు ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలి. ర్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలోని ఐలమ్మ విగ్రహానికి బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ అణచివేత కు ఎదురు నిలిచిన తెలంగాణ పోరాట వీరవనిత సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన చాకలి ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఆ కాలంలో తెలంగాణలో ధరలు భూస్వాముల ఆధిపత్యం కారణంగా పేద రైతులకు కూలీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెట్టి చాకిరి అధిక పనులు భూములపై పెత్తనం వంటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఐలమ్మ పోరాటం కీలకపాత్ర పోషించిందని అన్నారు. తన భూమి హక్కును కాపాడుకోవడానికి భూస్వామ్య శక్తులకు ఎదురునిలిచి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఈ కార్యక్రమంలో!! బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్ రజక, బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, సామాజికవేత్త ఉద్యమకారుడు యం డీ మహమ్మద్ కొత్తగూడెం,బీసీ విద్యార్థి పట్టణ కార్యదర్శి నక్క నాగరాజ్ ముదిరాజ్,బీసీ యువజన నాయకులు తాడూరి సైదులు రజక, తుపాకుల తుకారం రజక, భీమరాజ్ యర్రబెల్లి వెంకన్న రజక,తదితరులు పాల్గొన్నారు



