హాలియాలో 9 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

ప్రజాలహరి హాలియా; హాలియా మండలం ఇబ్రహీంపేటలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో హాలియా ఎస్ఐ బి సాయి ప్రశాంత్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దాడి నిర్వహించారు కాగా పోలీసు సిబ్బందిని చూసి సదరు వ్యక్తులు పారి చూడగా పోలీసులు వారిని వెంబడించి 9 మందిని పట్టుబడి చేసినట్లు మరియు వారిపై కేసు నమోదు చేసి మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సదరు వ్యక్తులు ఆదుబోయిన సైదులు (36), అనుముల మధు (32), చాపల మహేష్ (35), వజ్జ యాదయ్య (36), విశ్వనాధుల సైదాచారి (36), కంభంపాటి సైదులు (40), నాగిళ్ల ఆంజనేయులు (40), ఈగల ప్రశాంత్ (30), అనుముల దుర్గయ్య (43), లనుండి 8100 నగదు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. మరియు ప్రజలు జూదము బెట్టింగ్ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తీవ్రంగా హెచ్చరించారు

You May Have Missed