మిర్యాలగూడ రెడ్డీకాలనీ లో ఘనంగా గణనాథుడి నిమజ్జనం
ప్రజాలహరి మిర్యాలగూడ: (హరి ప్రసాద్ చీదళ్ళ) మిర్యాలగూడ పట్టణంలోని 20వ వార్డు రెడ్డి కాలనీ శ్రీ కోదండ రామాలయం ఆవరణలో స్థానిక కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ – శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. నవరాత్రుల అనంతరం స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రామాలయం ప్రాంగణంలో నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLR బ్రదర్స్, మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.



