గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్యాక్‌సైడ్, హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరుమర్రి కృష్ణయ్య, నారాయణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed