మర్రి ఆనందం మృతికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR సంతాపం
ప్రజాలహరి మిర్యాలగూడ;సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అంతర్ముఖం అధినేత మర్రి ఏలియాస్ సోదరులు, వేములపల్లి మండలం రావులపెంట గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్రి ఆనందం అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR కాంగ్రెస్ నాయకులతో కలిసి రావులపెంట గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి మర్రి ఆనందం పార్థివ దేహాన్ని సందర్శించారు…ఈ సందర్భంగా పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు…మర్రి ఆనందం మృతి కాంగ్రెస్ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పేర్కొన్నారు…వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు…ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



