విద్యార్థుల క్రమశిక్షణే వారి ఉన్నతికి మార్గం- పూర్వ విద్యార్థిని, అదే పాఠశాలలో సేవలందిస్తున్న ప్రాధానోపాధ్యాయురాలు సలీమా కు అభినందనలు– ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కొనకంచి చంద్రశేఖర్ రావు
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కొనకంచి చంద్రశేఖర్ రావు డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు.బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థి స్థాయి నుండి పిల్లలను తీర్చి దిద్దగలిగే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని,. మా చిన్న తనంలో మా గురువులు నేర్పిన నైతిక విలువలు, క్రమశిక్షణ ద్వారానే నేడు గ్రామానికి సర్పంచ్ అయ్యే అవకాశం దక్కిందని వారు తెలిపారు. అదే విధంగా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సలీమా సైతం నేడు చదువుకున్న పాఠశాలకే ప్రధానోపాధ్యాయురాలిగా కాగలిగిందని గుర్తు చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు సరైన క్రమశిక్షణతో తయారు చేయడంలోనే విద్యార్థుల భవిష్యత్ సన్మార్గంలో ఉండటానికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు వారి చిన్న నాటి గురువులను స్మరించుకుని, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వవిద్యార్థిని అయినట్టి ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు సలీమా, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కొండబోయిన కవిత, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు



