బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల అణచివేతకు నిరసనగా మిర్యాలగూడలో భారీ నిరసన
ప్రజాలహరి మిర్యాలగూడ అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో పాటు, ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై పోలీసులు వ్యవహరించిన అణచివేత ధోరణికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు.అనంతరం మిర్యాలగూడ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం, నాయకులపై పోలీసులతో అణచివేత చర్యలకు పాల్పడడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతును నొక్కడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రతిపక్షాల హక్కులను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తిప్పన విజయసింహ రెడ్డి, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి.ఇలియాస్ ఖాన్, ధనావత్ చిట్టిబాబు నాయక్,ఎండి.మగ్దుం పాషా, ఎండి.మాజీద్, పద్మశెట్టి కోటేశ్వర రావు, గంగుల బిక్షం, రావూరి సుధాకర్, చంద్రశేఖర రావు, రవి, దుర్గాప్రసాద్, మట్టపల్లి సైదులు యాదవ్,,ఎండి.షోయబ్,యర్రమల్ల దినేష్, చౌగాని బిక్షం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జానయ్య, జక్క నాగేశ్వరరావు, సూర్య నాయక్, ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, పిసికె ప్రసాద్, ఎలకాని రమణ, పాశం నరసింహారెడ్డి, పులి జగదీష్, వింజం శ్రీధర్, పెండ్యాల పద్మ,కోదాటి రమా, షహనాజ్ బేగం,పెరుమాళ్ళ ధనమ్మ, లలిత, శ్రీను నాయక్ , తుమ్మల ఫణి కుమార్, ఎండి గయాజ్,, ఆయిల్ శ్రీను, ఇక మణిదీప్, శ్రీనాథ్ , పిన్న బోయిన శ్రీనివాస్ యాదవ్ , మదర్ , జిడిఆర్ జానీ, ఎస్డి, శంకర్ నాయక్, మస్తాన్, నూనె రవికుమార్, ముబిన్, ఖలీల్, మలవత్ రవీందర్ నాయక్, జీవన్, వల్లంపట్ల వినోద్, మర్రి అంజిబాబు, చందు యాదవ్, ఏలుగుబెల్లి,,నాగరాజు, నర్ర ముకేశ్ చౌదరి, గోపి, నగేష్ చంటి శ్రీకాంత్ కిరణ్ అంజి అనిల్, జనాపాల కిరణ్, నాకు నాయక్, హన్ను, వీరయ్య, ఇమ్రాన్, సందీప్, BRS నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్చార్జిలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



