కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా BRS ఆందోళన
ప్రజాలహరి మిర్యాలగూడ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల BRS పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం BRS పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ, బస్టాండ్ మీదుగా రౌండ్ దాకా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ RDO కార్యాలయ౦లో మరియు MPDO ఆఫీస్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిప్పన విజయసింహ రెడ్డి, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి.ఇలియాస్ ఖాన్, ధనావత్ చిట్టిబాబు నాయక్,ఎండి.మగ్దుం పాషా, ఎండి.మాజీద్, పద్మశెట్టి కోటేశ్వర రావు, గంగుల బిక్షం, చంద్రశేఖర రావు, రవి, దుర్గాప్రసాద్, మట్టపల్లి సైదులు యాదవ్,,ఎండి.షోయబ్,యర్రమల్ల దినేష్, చౌగాని బిక్షం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జానయ్య, జక్క నాగేశ్వరరావు, సూర్య నాయక్, ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, పిసికె ప్రసాద్, ఎలకాని రమణ, పాశం నరసింహారెడ్డి, పులి జగదీష్, వింజం శ్రీధర్, పెండ్యాల పద్మ,కోదాటి రమా, షహనాజ్ బేగం,పెరుమాళ్ళ ధనమ్మ, లలిత, శ్రీను నాయక్ , తుమ్మల ఫణి కుమార్, ఎండి గయాజ్,, ఆయిల్ శ్రీను, ఇక మణిదీప్, శ్రీనాథ్ , తిన్న పోయిన శ్రీనివాస్ యాదవ్ , మదర్ , జిడిఆర్ జానీ, ఎస్డి, శంకర్ నాయక్, మస్తాన్, నూనె రవికుమార్, ముబిన్, ఖలీల్, మలవత్ రవీందర్ నాయక్, జీవన్, వల్లంపట్ల వినోద్, మర్రి అంజిబాబు, చందు యాదవ్, ఏలుగుబెల్లి,,నాగరాజు, నర్ర ముకేశ్ చౌదరి, BRS నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్‌చార్జిలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



