మిర్యాలగూడ బీసీ భవన్ లో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 139 జయంతి
ప్రజాలహరి మిర్యాలగూడ; హైదరాబాద్ తొలి మేయర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ రచయిత విద్యావేత్త పాత్రికేయుడు స్వతంత్ర సమరయోధులు బహుజన నాయకుడు శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజు 133వ జయంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించిన బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్. కొరివి కృష్ణ స్వామి ముదిరాజు గారి 133వ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువకులు నడుము బిగించి పాటుపడుతూ కృషి చేయాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేనిఫెస్టోలో చేర్చిన విధంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదిరాజులను బిసి డి నుంచి బీసీ ఏ లోకి త్వరగా అమలు చేసి ప్రకటించాలి. బీసీ బిడ్డ మహిళ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గం. బీసీ సంఘాల బీసీ జేఏసీ పక్షాన మేము చాలా తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బీసీలు అందరూ ఐకమత్యమై మన హక్కులను మనం సాధించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణ నకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14 తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ గెజిట్ లో 10.వ కాలంలో మీరు ఎస్సీ నా, మీరు ఎస్టీ నా, ఇతరులు అని చేర్చి ఓబీసీలకు సంబంధించిన కాలం లేకపోవడం ఓబీసీలను లెక్కించకపోవడం మోసం చేస్తున్న బి జె పి ప్రభుత్వం చాలా అన్యాయం సిగ్గుచేటు దుర్మార్గం. 1893 సెప్టెంబర్ లో కృష్ణాష్టమి రోజు జన్మించిన శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజు కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ సామాజిక రాజకీయ విద్యారంగాలలో ప్రముఖంగా పనిచేసిన నాయకుడు ఆయన కార్యకర్త, రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త, మున్సిపల్ కౌన్సిలర్ గా సేవలందించారు 1957 1958 హైదరాబాద్ తొలి మేయర్ గా పని చేశారు కృష్ణ స్వామి ముదిరాజ్ పేద ముదిరాజ్ రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి విద్యాబ్యాసం పూర్తి చేశారన్నారు. స్థానిక మిర్యాలగూడ పట్టణంలో బీసీ బాలుర వసతి గృహంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి హైదరాబాద్ తొలి మేయర్ ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజు 133వ జయంతిని ఘనంగా బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజు గారి చిత్రపటానికి పూలమాలతో గణమైన నివాళులర్పించడం జరిగింది. బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజు కష్టపడి విద్యాబ్యాసం చేశారన్నారు. గ్రామానికి చెందిన సామాజిక నేపథ్యం రావడంతో అక్కడ దోపిడీకి గురవుతున్న అష్ట కష్టాలు పడుతున్న ప్రజానీకం వారు అవలంబిస్తున్న మూఢనమ్మకాలు ఆచారాలను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. వృత్తిరీత్యా తన తండ్రి బ్రిటిష్ సైన్యం లో పనిచేయడంతో త్యాగశీలత తమతో మమేకమైందని చెప్పవచ్చని అన్నారు. చాతరగతి ఉన్నత పాఠశాలలో కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారన్నారు. తర్వాత బొంబాయిలో ముద్రణ ప్రచురణ సాంకేతికపై శిక్షణ పొందారు. ఎంతకాలం నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ ప్రసాద్ పెద్ద ప్రైవేటు కార్యదర్శిగా ఎడిటర్ జనరల్ తరంలో పనిచేసే రచయితగా పాత్రికేయుడు ఆయనకు చరిత్ర జర్నలిజం ప్రచురణ రంగాలపై గొప్ప ఆసక్తి ఉండేది అన్నారు. దక్కన్ స్టార్ అనే రంగుల పత్రికలో పనిచేశారు అన్నారు. మాసావా అంటే ఉర్దూ పత్రికలకు సంపాదకత్వం వహించారన్నారు. 1925లో సొంత ముదిరాజ్ స్థాపించారన్నారు. 1929 హైదరాబాద్ నగర చరిత్ర సంస్కృతి భవనాలు ప్రముఖ వ్యక్తుల గురించి వివరించే విక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంధాన్ని ప్రచురించారన్నారు. ఈ గ్రంథం హైదరాబాద్ చరిత్రకు ముఖ్యమైన దస్తావేజుగా గుర్తించబడిందన్నారు. ముదిరాజ్ సమాజానికి సేవలు 1922,లో ఆయన ముదిరాజ్ మహాసభ వ్యవస్థను స్థాపించి సమాజంలో ఐక్యత విద్య సామాజిక చైతన్యం పెంపొందించేందుకు కృషి చేశారన్నారు. కృష్ణ స్వామి ముదిరాజు గారి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుందన్నారు. సమాజాభివృద్ధి కేవలం రాజకీయ ఆపదలతో రాదు అని అన్నారు. విద్యా ఐక్యత ఆత్మ గౌరవం చైతన్యం సామాజిక బాధ్యత ప్రజాసేవతో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకే ఆయనను కేవలం ముదిరాజ్ నాయకుడిగా కాకుండా సామాజిక చైతన్యవేత్తగా, విద్య ప్రేరణ దాతగా సంఘటిత శక్తికి మార్గదర్శకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికి ఎంతైనా ఉందని అన్నారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 133వ జయంతి రోజున ఆయనను స్మరించుకోవడం మాత్రమే కాదు ఆయన చూపిన మార్గంలో విద్యా ఆత్మగౌరావం సామాజిక బాధ్యతలకు అడుగులు వేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి. నిన్న జరిగిన బిసి బిడ్డ మహిళా మంత్రి కొండ సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గం. బీసీ సంఘాల జేఏసీ పక్షాన చాలా తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అందరు ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2020లో జరిగే జనగణలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14 తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ గెజిట్లో ఎస్సీ ఎస్టీ అని చేర్చి ఓబీసీలకు సంబంధించిన కాలం లేకపోవడం చాలా అన్యాయం సిగ్గుచేటు దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను బిసి డి నుంచి బీసీ ఏ ల్లోకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేనిఫెస్టోలో చేర్చిన విధంగా త్వరగా అమలు చేసి ప్రకటించాలన్నారు. చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. మేమెంతో మాకంత బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి 133 వ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువకులు నడుంబిగించి పాటుపడాలని కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో:: బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక , బీసీ బాలుర వసతిగృహ వార్డెన్ తరుణ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం పట్టణ కార్యదర్శి నక్క నాగరాజు ముదిరాజ్, సామాజికవేత్త ఉద్యమకారుడు ఎండి మహమ్మద్ కొత్తగూడెం, భాను, విక్రమ్,వినోద్, సాయిరాం, జాను, గోపి, దత్తు, రాజేష్,అనిల్, శివ, అనిల్,కిరణ్,చైతన్య, నాగరాజు, భరత్,ఈశ్వర్, కార్తీక్ సుమన్,నవీన్, శివ, తదితరులు పాల్గొన్నారు



