ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం వృద్ధులు, వికలాంగులు, మహిళలతో కలిసి బీఆర్ఎస్ నిరసన వంటా వార్పుతో సాగర్ రోడ్డును హోరెత్తించిన బీఆర్ఎస్
ప్రజాలహరి మిర్యాలగూడ; కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సి MC కోటి రెడ్డి హాజరై .. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలు చేశారు “ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. ప్రజలకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలతో సాగర్ రోడ్డును హోరెత్తించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంపై ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పన విజయసింహ రెడ్డి,ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,అన్నబీమోజు నాగార్జున చారి,ఎండి.యూసుఫ్, పెండ్యాల పద్మావతి, కుర్ర చైతన్య, షహనాజ్ బేగం, ధూళిపాల కళావతి, కోదాటి రమ, పెరుమాళ్ళ ధనమ్మ, చిత్రం ఉమా, గడ్డం దీపిక, గుడిసె జానకమ్మ, లావూరి అరుణ, సందేశ్ రజిని, జనపాల సునీత, పద్మశెట్టి లక్ష్మి, తీరంశెట్టి సీత, రేబిల్లి శ్రీజ, నూనె మమత, బంటు కాత్యాయని, నక్క సంధ్య, బల్లెం దేవకమ్మ, కమటాల స్వరూప,ఎండి.ఇలియాస్ ఖాన్,ఎండి.మగ్దుం పాషా,ఎండి.మాజీద్,ఎండి.షోయబ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్,అంగోతు హతిరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇంచార్జ్ లు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



